చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో.. భూమిని చూసి ఓర్పును నేర్చుకో... చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో.. ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
Saturday, December 1, 2018
Friday, November 30, 2018
Sunday, October 28, 2018
Radio Lesson 30.10.18
📻
"విందాం - నేర్చుకుందాం" : రేపటి రేడియో పాఠం
★ తేది : 30.10.2018
★ సమయం : 11-00 AM
★ పాఠం పేరు : " నీడఖరీదు "
★ తరగతి : 5th Class
✨ రేపటి రేడియో పాఠం (30.10.2018) : నీడ ఖరీదు.. బోధనా లక్ష్యములు,కృత్యం, బోధనాభ్యసన సామాగ్రి, పాట... కొరకు⤵
Download నీడ ఖరీదు Radio Lesson
కస్తూరి బాలికల విద్యా పత్రిక
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం , సర్వ శిక్షా అభియాన్ వారి
ద్వైమాసిక బాలికల విద్యా పత్రిక
2017 జనవరి లో ప్రారంభమైన కస్తూరి బాలికల విద్యాపత్రికలన్నింటిని Downloadచేసుకోండి.
Download కస్తూరి Mar -Apr 2017
Download కస్తూరి May-June 2017
Download కస్తూరి July -Aug 2017
Download కస్తూరి Sept-Oct 2017
Download కస్తూరి Nov-Dec 2017
Download కస్తూరి Jan-Feb 2018
Download కస్తూరి Mar-Apr 2018
Download కస్తూరి May-June 2018
Download కస్తూరి July -Aug 2018
Download కస్తూరి Sep -Oct 2018
Tuesday, October 23, 2018
25.10.2018 Radio Lesson
📻
✨ రేపటి రేడియో పాఠం (25.10.2018) : పెద్ద సంఖ్యలు.. బోధనా లక్ష్యములు,కృత్యం, బోధనాభ్యసన సామాగ్రి, పాట... కొరకు
Download పెద్ద సంఖ్యలు 5th Maths
Balotsav 2018 - Competitions - Rules - Schedule - Registration Forms
వివిఐటి బాలోత్సవ్
నంబూరు గ్రామం,
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ 52250
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా
ఆంధ్రప్రదేశ్ 52250
పిల్లల అభ్యున్నతి మూడు అంశాల పైన ఆధారపడుతుంది. జ్ఞాపకశక్తి, సృజనాత్మకత, పరిసరాలు. ఈ మూడింటి నుంచి సమపాళ్ళలో అందుకోలేని పిల్లలు ఆ మేరకు అసమగ్రంగా మిగిలిపోతారు. దురదృష్టవశాత్తూ విద్యావిధానంలో ఏర్పడిన మూసతత్వం వల్ల, ఎక్కువ మార్కులు సాధించడమే పిల్లవాడి ప్రతిభకు గీటురాయి కావడం వల్ల మనం జ్ఞాపకశక్తికి ఇస్తున్న ప్రాధాన్యం మిగిలిన అంశాలకు ఇవ్వడం లేదు. దీనివల్ల పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతోంది. సమాజం నుంచి, పరిసరాల నుంచి నేర్చుకోగలిగింది కూడా వెనకబడిపోతోంది. వేగంగా నగరీకరణ చెందడం, ప్రకృతితో సంబంధం తెగిపోవడం, సమిష్ఠి తత్వానికి దూరం కావడం ఇవన్నీ ముందుతరాలకు నష్టం కలిగించే అంశాలు.
జీవనశైలులు మారుతున్న నేపధ్యంలో పిల్లలు మూడవ ఏడు ప్రవేశించడంతోనే బడి ప్రవేశం కూడా చేస్తున్నారు. అక్కడినుండి గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకూ అంటే దాదాపు 17, 18 సంవత్సరాలు విద్యాలయాల్లోనే గడిపేస్తున్నారు. విద్యాబోధనతో పాటు వారిలోని సృజనాత్మక శక్తులను గుర్తించి పెంపొందించడం వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చెయ్యాల్సి రావడం నేటి విద్యాసంస్థల బాధ్యతగా పరిణమించింది. ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు విద్యార్ధులకు అందుబాటులో రావడం వల్ల పిల్లల ఆలోచనపై ఏయే అంశాలు ఎలాంటి ప్రభావాలు ఎంత మేరకు చూపుతున్నాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ఒక్కొక్క విద్యార్ధినీ ఒక ప్రత్యేకమైన అంశంగా పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో రూపు దిద్దుకుంటున్న వ్యక్తి తత్వం పిల్లల్లో కూడా ప్రతిఫలిస్తోంది.
ఆరోగ్యకరమైన సమిష్ఠి తత్వాన్ని పెంపొందించడానికి సామాజికులు ఒక చోట చేరడం అవసరమని మన ప్రాచీనులు ఏనాడో గుర్తించారు. దైనందిన జీవన కార్యకలాపాలకు విశ్రాంతినిచ్చి ఉత్సాహపూరిత వాతావరణంలో పదిమందీ కలిసి తమ అనుభవాల్నీ, అనుభూతుల్నీ పంచుకోవడాన్ని ఉత్సవం అన్నారు. ఉత్సవాల నిర్వహణ వల్ల సామాజిక దృక్పధం మెరుగుపడడాన్ని గమనించారు.
వివిధ ప్రాంతాల నుంచి, విభిన్న నేపధ్యాల నుంచి, బహుళ సంస్కృతుల నుంచీ ఎదుగుతున్న పిల్లలందరూ ఒక్కచోట చేరి ఒక ఉత్సవం జరిపినపుడు ఆదాన ప్రదానాల వలన విద్యార్ధుల్లో సృజనాత్మకత పెరిగేందుకు అవకాశం ఉంటుందని, పోటీతత్వం వలన చొరవ, చురుకుదనం పెరుగుతాయని ఆశిస్తున్నాం.
అయితే ఇలాంటి ప్రయత్నం తెలుగు రాష్ట్రాల్లో ఇంతకూ ముందు కొత్తగూడెంలో బాలోత్సవ్ పేరుతో జరిగిందని తెలిసిందే. వారు పాతికేళ్ళుగా చేస్తున్న ఉత్సవాన్ని పోయినేడు రజతోత్సవం జరిపి విరామమిచ్చారని తెలిసింది. ఇలాంటి ఉత్సవాలు ఆగకూడదు. అందుకే VVIT ఆ బాధ్యతని అందిపుచ్చుకుంది. మొత్తం 20 అంశాలలో 36 విధాలైన పోటీలు ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు గల విద్యార్ధుల మధ్య నిర్వహించబడతాయి.
బాలోత్సవ్ 2018 నందు పాల్గొనదలచిన ప్రతి ఒక్కరు విధిగా రిజిస్ట్రేషన్ చేసుకొనవలెను. అందుకు ఈ క్రింద ఇచ్చిన రెండు పద్ధతులలో మీకు నచ్చిన ఏదైనా ఒక దానిని అనుసరించవచ్చు.
1. బాలోత్సవ్ 2018 ఎంట్రీ ఫారం డౌన్ లోడ్ చేసుకొనవలెను. దాన్ని ప్రింట్ తీసుకుని నింపి ఈ క్రింది అడ్రెసుకి పోస్టులో పంపగలరు.
కన్వీనర్,
వివిఐటి బాలోత్సవ్ 2018,
వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ,
నంబూర్ గ్రామం,
పెదకాకాని మండలం,
గుంటూరు జిల్లా.
ఆంధ్రప్రదేశ్ 522508
2. గూగుల్ ప్లే స్టోర్ నుండి మా వివిఐటి బాలోత్సవ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని దాని ద్వారా రిజిస్టర్ కావచ్చు. రిజిస్టర్ అయిన వారికి ఒక ఇమెయిల్ వస్తుంది. ఇమెయిల్ ను ప్రింట్ తీసుకుని మీ ప్రధానోపాధ్యాయుల వారి సంతకం చేయించి బాలోత్సవ్ జరిగే రోజు తీసుకురాగలరు.
TaRL శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన మెటీరియల్స్
TaRL శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ముఖ్యమైన మెటీరియల్స్ మీ కోసం
తెలుగు బోధనా పద్దతి (కమాల్ )
గణిత బోధనా పద్దతి (కమాల్)
TaRL ఉపాద్యాయ కరదీపిక
Monday, October 22, 2018
23.10.2018 Radio Lesson
✨ రేపటి రేడియో పాఠం (23.10.2018) : దారి తెలుసుకుందాం.. బోధనా లక్ష్యములు,కృత్యం, బోధనాభ్యసన సామాగ్రి, పాట... కొరకు⤵
4th EVS దారి తెలుసుకుందాం
Monday, October 15, 2018
Relaxation of upper age limit from 34 to 42 years for the ensuing recruitments through Public Service Commission and other Recruiting Agencies up to 30-09-2019 – Orders – Issued.
Relaxation of upper age limit from 34
to 42 years for the ensuing recruitments through Public Service Commission and
other Recruiting Agencies up to 30-09-2019 – Orders – Issued
G.O. M.S. N.O.132 To Download CLICK HERE
KURNOOL DIST. Academic Instructors Notification details
Sunday, October 14, 2018
RGUKT IIIT Nuzvid Second Selection List 2018
ప్రత్యేక విభాగంలో అనగా sports,games,ncc,phcఎంపిక అయిన IIIT విద్యార్థుల జాభితా
RGUKT IIIT Nuzvid Second Selection List 2018
Friday, October 12, 2018
NEW GUIDELINES FOR SSA POSTS
sarva-siksha-abhiyan-ssa-recruitment-posts-guidelines-ap
RC.NO.5101, DATED 10-10-2018
Thursday, October 11, 2018
RC NO. 8313 DEO PRAKASAM INSTRUCTIONS TO ALL AP DEOs - PRATHIBHA AWARDS-CENTER INCHARGES LIST
RC NO. 8313 DEO PRAKASAM INSTRUCTIONS TO ALL AP DEOs - PRATHIBHA AWARDS-CENTER INCHARGES LIST
RC NO. 8313 DEO PRAKASAM INSTRUCTIONS TO ALL AP DEOs
PRATHIBHA AWARDS-CENTER INCHARGES LIST
Rc No. .611993 Request to Arrange the facilities to the Teachers - Staff Rooms ,Furniture ,Tea/Cofee Facility ,etc in all schools in the State Reg
PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION:
ANDHRA PRADESH :: AMARAVATI,
PRESENT: Sri G. Srinivas, I.A.S.
Rc.No,611993/CBE/DC/2018, DT.07.10.2018
Sub: School Education -Design Cell -Request to arrange the facilities to the Teachers -Staff Rooms, furniture, tea/coffee facility, etc. in all schools in the State -Reg.,
- Staff room/s should be well maintained and given a face-lift to ensure a welcoming ambience for teachers.
- Teachers have a long working day. Hence, for those teachers interested to have Tea/Coffee, local arrangement may be made through contributory mechanism.
- Staff rooms should be well furnished with good tables and chair for teachers.
- A locker / Cabinet may be provided so that Teachers can keep their personal or academic material safely.
Towards this instructions may be issued to the concerned Headmasters to take action on serial 1 and 2 below in the schools , where ever feasible.
SPD, SSA is being addressed to ensure provision of furniture and lockers for Teachers Staff Rooms part of the HAM (Hybrid Annuity Mode). Work orders are already issued package wise. While reviewing at the district level, the final list of furniture to be provided, in coordination with the SSA Engineering team, Teachers Staff room requirements covering serial 3&4 may be got included
Therefore, the District Educational Officers in the State are request to give necessary instructions to the DyEOs / MEOs / HMs in the district on serials I & 2. Available funds at the school level may be utilized for improving the ambiance of the staff rooms.
Rc No. .611993 Request to Arrange the facilities to the Teachers - Staff Rooms ,Furniture ,Tea/Cofee Facility ,etc in all schools in the State Reg To down load
Prathibha Awards Guidelines
Prathibha Awards Guidelines
2018 విద్య సవత్సరం నందు మార్చ్ లో జరిగిన 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలలో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్ధినీ విద్యార్ధులకు ప్రతిభ అవార్డ్స్ ది 15-10-2018 సోమవారం ఉదయం 10 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి మరియు గౌరవ మనవ వనరుల శాఖ మంత్రి గారు ద్వారా బహుకరించాబాడును .
హాజరయే వారు తీసుకు రావలసినవి :-
- చదివిన పాటశాల నుండి గుర్తింపు కార్డు
- బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి జెరాక్స్
- తమ తల్లి లేక తండ్రి లేక వారి టీచర్స్ తో హాజరు కావాలి
- ఆధర్ కార్డు కూడా తెసుకు వెళ్ళాలి
కావాల్సిన ప్రదేశం : Mini Stadium, South Bypass Road , Ongole , Prakasam Distirct
తేది :15-10-2018
Annexure -1 ప్రోపార్మ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత హెడ్ మాస్టర్స్ తో సంతకంతో దానిని వారి వెంట తెసుకుని వెళ్ళాలి
డౌన్లోడ్ Annexure -1
Prathibha Awards Grieavance -2018
Pathibha Awrds Provisanal Selected List
Annexure -1 యందలి వివరాలు విద్యార్ధి యొక్క బ్యాంకు పాస్ బుక్ మొదతటి పేజి ని www.cse.ap.gov.in వెబ్సైటు నందు అప్లోడ్ చేయాలి అల చేసిన వారికి మాత్రమే స్కాలర్షిప్ వారి ఖాతా కు జమ చేయబడును
Wednesday, October 10, 2018
Prathibha Awards Venue Change
🅰🅿
*RC No:417*
*Dated:10-10-2018.*
★ ప్రతిభా అవార్డులు-2018 ప్రధానోత్సవ స్థలం మార్పు.
★ రాజమండ్రి నుండి ఒంగోలుకు మారిన వెన్యూ.
★ ది.15-10-18న మిని స్టేడియం, సౌత్ బైపాస్ రోడ్, ఒంగోలు-ప్రకాశం జిల్లా నందు అవార్డుల ప్రధానోత్సవం.
Click here
Tuesday, October 9, 2018
నేటి కథ 10.10.2018
🍁నేటి కథ
🍥 తప్పెవరిది?
ఒక అడవిలో జంతువులన్నీ ఐకమత్యంగా ఉండేవి. తల్లిదండ్రులు ఆహారం కోసం వెళ్లినప్పుడు పిల్లలన్నీ కలిసి ఓ దగ్గర చేరి ఆటలాడేవి. సింహపు పిల్లతో జింక పిల్ల, ఏనుగు పిల్లతో ఎలుక పిల్ల, ఎలుగుబంటితో కోతిపిల్లా కబుర్లు చెప్పుకుంటూ గడిపేవి.
ఒక రోజు కోతి పిల్ల ‘ఆటలు ఆడగా ఆడగా విసుగొస్తోంది. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, కథలు చెప్పడంలాంటి కొత్త ఆటలు నేర్చుకుందామా?’ అని అడిగింది. మిగతావి సరేనన్నాయి. అప్పటి నుంచి కొత్త ఆటలు ఆడటం ప్రారంభించాయి.
పిల్ల జంతువుల కొత్త ఆటల్ని ఒకసారి మృగరాజు చూసింది. వాళ్లకి పద్ధతి ప్రకారం విద్య నేర్పితే తెలివితేటలు పెరుగుతాయని అనుకుంది. వెంటనే ముసలి నక్కను పిలిచి గురువుగా బాధ్యత తీసుకుని విద్యలు నేర్పమంది.
సింహం పిల్లకి గురువు మాటలు లెక్కలేదు. గురువు చెప్పే విద్యలు ఎప్పుడూ వినిపించుకోలేదు. సింహంకూన సంగతి మృగరాజుకి చేరితే విద్య చెప్పడం చేతకాదని తననెక్కడ చంపేస్తుందోనని భయపడింది నక్క. ఆ ప్రమాదం రాకుండా మృగరాజును కలుస్తూ ‘మీ కొడుకు మహా తెలివైనవాడు. అన్ని విద్యల్లో అతడే మేటి’ అనేది. కొన్నాళ్లు గడిచింది.
తమకు మంచి జరగాలని అడవి తల్లి సంబరం చేయాలని జంతువులనుకున్నాయి. చుట్టాలకు, స్నేహితులకు కబుర్లు పెట్టాయి. సంబరాల రోజున తమ పిల్లలకు ప్రతిభా పోటీలు పెట్టి బహుమతులు పంచాలని మృగరాజుకు కోరిక కలిగింది. కొడుకు గొప్పదనం పక్క అడవుల్లో వాళ్లకు కూడా తెలుస్తుందని ఆశపడింది.
సంబరాలకు వచ్చిన సింహాన్ని ముఖ్య అతిథిగా, పులిని న్యాయ నిర్ణేతగా ఉండాలని కోరింది మృగరాజు. పిల్లలకు అనేక పోటీలు జరగగా, సింహపు కూన కనీస ప్రతిభను చూపలేకపోయింది. కుందేలు పిల్ల మొదటి బహుమతి, గుర్రం పిల్ల రెండో బహుమతి గెలుచుకున్నాయి. వస్తున్న కోపాన్ని అదుపు చేసుకుని బహుమతులిప్పించింది మృగరాజు.
‘మొదటి బహుమతి అందుకున్న పిల్ల కుందేలు మాట్లాడుతూ ‘బడిలో నా ప్రతిభను గుర్తించకుండా మృగరాజు పిల్లను ఎప్పుడూ పొగుడుతుండేది నక్క. నాలో పంతం పెరిగి కోయిల దగ్గర పాటలు, చిలక దగ్గర బొమ్మలు, మైనా దగ్గర కథలు, గుర్రం దగ్గర కొత్త ఆటలు నేర్చుకున్నాను. అమ్మా నాన్నల వద్ద సాధన చేస్తూ తప్పులు సరిదిద్దుకున్నాను. అందుకే బహుమతి పొందాను’ అంది.
జంతువులన్నీ అరుపులతో పిల్ల కుందేలుని మెచ్చుకున్నాయి. అందరి ముందూ గర్వంగా తలెత్తుకోవాలన్న తన ఆలోచన బెడిసికొట్టినందుకు అవమానంగా భావించింది మృగరాజు. తప్పుడు మాటలు చెప్పి పరువు పోవడానికి కారణమైన నక్క కోసం చూసింది. ప్రాణభయంతో అప్పటికే అడవి విడిచి పారిపోయింది నక్క.
‘నక్క చెప్పిన మాటలు నమ్మడమేగానీ కొడుకుని పరీక్షించకపోవడం తన తప్పేనని, పిల్లల విద్యల్ని తల్లిదండ్రులు అప్పుడప్పుడూ పరీక్షించి తెలుసుకోవాలని’ అనుకుంది సింహం.
GUVVAKU JARAMAMMA 2nd Class TELUGU RHYME
గువ్వకు జ్వరామమ్మా....అభినయ గేయం.....GUVVAKU JARAMAMMA TELUGU RHYME
DEPARTMENTAL TEST REVISED TIME TABLE
🅰🅿
*🍁 DEPARTMENTAL TESTS*
*NOTIFICATION NO.07/2018*
*✨REVISED TIME TABLE & SCHEME*
_____________
*✨10/11/2018 SATURDAY (FORE NOON) – 10.00 AM to 12.00 Noon*
~[Previous Date 12/11/2018, MONDAY]~
GOT Code 88. Departmental Test for Gazetted Officers of the Education Department, First Paper(WITH BOOKS).
~~~~~
*✨10/11/2018 SATURDAY (AFTERNOON) - 3.00 PM to 5.00 PM*
~[Previous Date 12/11/2018, MONDAY]~
GOT Code 97. Departmental Test for Gazetted Officers of the Education Department, Second Paper (WITH BOOKS).
~~~~~
*✨11/11/2018 SUNDAY (FORE NOON) – 10.00 AM to 12.00 Noon*
~[Previous Date 13/11/2018, TUESDAY]~
EOT Code 141. The Accounts Test for Executive Officers (WITH BOOKS
~~~~~
*✨11/11/2018 SUNDAY (AFTERNOON) - 3.00 PM to 5.00 PM*
~[Previous Date 13/11/2018, TUESDAY]~
37. Special Language Test for Officers of the Education Department, Higher
Standard (WITHOUT BOOKS) 3hours (3.00 PM to 6.00 PM).

BEd Eligible for AP TET
🍁
BEd అభ్యర్థులు కూడా AP TET పేపర్ 1 కు అర్హులే...SGT పోస్ట్ లకు
▪APTET సవరణ ఉత్తర్వులు సంఖ్య 66 విడుదల.. పూర్తి వివరాలు.. కింద లింక్ లో కలవు
BRAOU Distance B.Ed Counselling Schedule
BRAOU Distance B.Ed Counselling Schedule, Call Letter List, Rank Cards Released available at below link
Click here
IASE, KURNOOL.. 10th CLASS Mathematics Question Bank
IASE, KURNOOL.. 10th CLASS Mathematics Question Bank
▪గణితశాస్త్రం 10వ తరగతి ప్రశ్నల నిధి..
▪ఐ.ఎ.ఎస్.ఇ. కర్నూలు, ఆంధ్రప్రదేశ్..
Click here to download
Monday, October 8, 2018
పద్మావతి మహిళా యూనివర్సిటీ Distance B.Ed నోటిఫికేషన్
2018-19 విద్యాసంవత్సరానికి గానూ పద్మావతి మహిళా యూనివర్సిటీ Distance B.Ed నోటిఫికేషన్ విడుదల.
మహిళా ఉపాధ్యాయులకు మాత్రమే అవకాశం.
దరఖాస్తుకై చివరి తేది: 12-11-18.
దరఖాస్తుకై క్లిక్ చేయండి
⬇
https://drive.google.com/file/d/1IMWnmjB-JLBilXVA8k4YZNVw-GwPRkbw/view?usp=drivesdk
2018-19 పద్మావతి మహిళా యూనివర్సిటీ Distance B.Ed నోటిఫికేషన్
https://drive.google.com/file/d/1fXmC1w3-IX806cGACERSLDDHdgPrtgJW/view?usp=drivesdk
*🍁నేటి కథ*
*🍥 బుజ్జి కుక్క*
ఎనిమిదేళ్ల నందు మూడో తరగతి చదువుతున్నాడు. బడి ఇంటికి దగ్గరే. ఓ రోజు నడుచుకుంటూ వస్తుంటే ఓ చెట్టు కింద నాలుగు బుజ్జి కుక్కపిల్లలు కనిపించాయి. ముద్దు ముద్దుగా ఉన్న వాటిని చూసేసరికి ఓ కుక్క పిల్లని ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు నందు. అప్పుడు ఆ కుక్క పిల్లల తల్లి లేదు. ఇదే సమయమని ఓ కుక్క పిల్లను తీసుకుని ఇంటికి వచ్చాడు.
తన పుస్తకాల దగ్గరున్న ఖాళీ అరలో పడుకోబెట్టాడు. కుయ్ కుయ్‌మంటూ అక్కడక్కడే తిరుగుతున్న కుక్క పిల్లను చూస్తూ ఆనందపడ్డాడు. బడి నుంచి వచ్చి చాలాసేపయినా నందు నిశ్శబ్దంగా ఉండటం గమనించిన అమ్మ వాడేం చేస్తున్నాడో చూద్దామని గదిలోకి వచ్చింది. కుక్క పిల్లతో ఉన్న నందుని చూసి ‘దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అని అడిగింది.
‘వస్తుంటే దార్లో కనిపిస్తే తీసుకువచ్చానమ్మా’ చెప్పాడు నందు.
‘తప్పు కదా! తన పిల్ల కనిపించక ఆ తల్లి ఎంత బాధపడుతుందో కదా! ఎందుకు తీసుకువచ్చావు?’ అని కోప్పడింది అమ్మ.
‘ఏం కాదులే. వాళ్లమ్మకి ఇంకా మూడు పిల్లలు ఉన్నాయి’ తేలిగ్గా చెప్పాడు నందు. వాళ్లమ్మ ఏం మాట్లాడకుండా వెళ్లిపోయింది.
కాసేపటికి ‘అమ్మా! కుక్కపిల్లకి ఆకలేస్తున్నట్లుంది కొంచెం పాలు ఇవ్వవా?’ అని అడిగాడు నెమ్మదిగా.
వాళ్లమ్మ చిరాగ్గా... ‘నువ్వు దాన్ని తీసుకు రాకపోతే అది వాళ్లమ్మ దగ్గర తాగి ఉండేది కదా పాలు’ అంటూనే చిన్న పళ్లెంలో పాలు పోసి నందు చేతికి ఇచ్చింది. ఆ పళ్లెం పట్టుకుని కుక్కపిల్ల ముందు ఉంచాడు నందు.
కుక్కపిల్ల నెమ్మదిగా పాలు తాగేసింది. నిద్రపోయింది.
‘పాపం ఆ కుక్క పిల్ల వాళ్లమ్మ కనిపించక ఎంత బాధపడుతుందో! దాన్ని తీసుకువెళ్లి ఎక్కడ నుంచి తెచ్చావో అక్కడే ఉంచేసిరా’ అంది అమ్మ.
‘అబ్బ! ఇది నాది. దీన్ని నేను పెంచుకుంటున్నా.’ అన్నాడు నందు.
రెండు రోజుల తర్వాత అమ్మ ‘నందూ! నీ సరదా తీరింది కదా! ఇక దీన్ని విడిచి పెట్టేసిరా. ఇది కూడా వాళ్లమ్మ మీద బెంగ పెట్టుకున్నట్టుంది’ అంది.
కానీ ససేమిరా అన్నాడు.
మర్నాడు నందు బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి వాళ్లమ్మ ఇంట్లో లేదు. ఊర్నించి వాళ్ల అమ్మమ్మ వచ్చి ఉంది.
‘అమ్మేది?’ అడిగాడు నందు అమ్మమ్మని.
‘ఊరెళ్లింది. పది రోజుల్లో వచ్చేస్తుందిలే’ చెప్పింది అమ్మమ్మ.
‘పది రోజులా!? ఈ పది రోజులూ నన్నెవరు చూస్తారు’ అడిగాడు నందు కోపంగా. ‘నేనున్నాగా’ అంది అమ్మమ్మ నవ్వుతూ.
‘నాకు అమ్మే కావాలి’ ఏడుపు లంకించుకున్నాడు నందు.
అలాగే అమ్మ లేకుండా రెండు రోజులు గడిచాయి.
నందు సరిగ్గా అన్నం తినలేకపోతున్నాడు. బడికి శ్రద్ధగా వెళ్లలేకపోతున్నాడు. చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాడు.
అమ్మ మీద బెంగ పెట్టుకుని దిగులుగా గడుపుతున్నాడు. కానీ కుక్కపిల్లను మాత్రం జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు.
మరో రెండు రోజుల తర్వాత నందు బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చే సరికి అమ్మ ఇంటికి వచ్చేసి ఉంది. అమ్మని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయ్యింది నందుకి.
‘ఎందుకమ్మా నన్నొదిలి వెళ్లిపోయావు? నువ్వు లేకపోతే నేనెంత బెంగ పెట్టుకున్నానో తెలుసా?’ అన్నాడు నందు అమ్మని పట్టుకుని ఏడుస్తూ.
నందు తల మీద చెయ్యివేసి సముదాయిస్తూ ‘ఏ పిల్లలయినా తల్లి దగ్గర లేకుండా ఉండలేరని ఇప్పటికైనా గ్రహించావా? నీకు నోరుంది కాబట్టి నీ బాధ చెప్పుకోగలిగావు. పాపం ఆ కుక్క పిల్లకి నోరు లేదు కదా! ఎలా చెబుతుంది అది అమ్మ కావాలని?’ అంది అమ్మ అనునయంగా.
నందుకి ఇప్పుడు తెలిసి వచ్చింది. అమ్మ దగ్గర లేకుండా ఎవరూ ఉండలేరని. వెంటనే ఆ కుక్క పిల్లని జాగ్రత్తగా తీసుకువెళ్లి మిగతా కుక్క పిల్లల దగ్గర వదిలి వచ్చాడు. ఇప్పుడు వాడి మనసు ఎంతో శాంతంగా ఉంది.
- కోనే నాగ వెంకట ఆంజనేయులు

Subscribe to:
Comments (Atom)